పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో: చంద్రబాబు
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనపై తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు.
ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీయేనని, పేదలకు ఇప్పుడు అందుతున్న దాని కంటే రెట్టింపు సంక్షేమం అందించేలా మేనిఫెస్టో ఉండాలని సూచనలు చేశారు. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా మహానాడు ఘనంగా నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.