సాహిత్య రంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి

సాహిత్య రంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి

 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులది, కళాకారులది కీలకపాత్ర ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ ముద్ర: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మునుపెన్నడూ లేనివిధంగా విస్తృతంగా వెలుగులోకి వచ్చిన సాహిత్య సాంస్కృతిక వికాసం. సీఎం కేసీఆర్‌ చొరవతో సాహిత్య అకాడమీ పునరుద్ధరణ జరిగిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహిత్య దినోత్సవ వేడుకలను కోదాడ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో నేటి తెలంగాణకు గల వ్యత్యాసాలను, జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని, వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య రంగాలలో జరిగిన అభివృద్ధి, విద్యుత్, సాగునీటి, త్రాగునీటి, సాంస్కృతిక ,పర్యాటకంగా, క్రీడలపరంగా జరిగిన అభివృద్ధిలపై కవులు కవులు కళాకారులు ఆలోచించాలని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ సర్కార్ ప్రవేశ పెట్టిన పథకాలు.. చేసిన అభివృద్ధిని ఈ వేడుకల్లో భాగంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.దశాబ్ది వేడుకల్లో భాగంగా… ఇవాళ తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటేలా వేడుకల నిర్వహణకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. రచన, పద్యం, కవిత్వంలో కవి సమ్మేళనాలు నిర్వహించనున్నారు.సాహిత్య దినోత్సవం కోదాడ గ్రంథాలయంలో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా వ్యాసరచన కవితల పోటీలు నిర్వహించడం అభినందనియం అని అన్నారు. ఎమ్మెల్యే కవులను కళాకారులను సన్మానించారు.ఈ సమావేశానికి గ్రంధాలయ చైర్మన్ రహీం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ కవచం వెంకటేశ్వరరావు , భరత్ రావు, సుబ్బారావు, సత్యబాబు, వెంపటి మధు, ఈదుల కృష్ణయ్య, చందు నాగేశ్వరావు, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, గుండెల సూర్యనారాయణ, సట్టు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కవులు, కళాకారులు, సాహిత్య వేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.