ప్రజాధనం ఉపయోగించి వీరు చేస్తున్న హడావిడి కేవలం వారి ప్రచార ఆర్భాటం కోసమేనా 

ప్రజాధనం ఉపయోగించి వీరు చేస్తున్న హడావిడి కేవలం వారి ప్రచార ఆర్భాటం కోసమేనా 
  • జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు,మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందేర్ గౌడ్
  • పట్టణంలో మంచినీటి సమస్య ప్రభుత్వానికి సిగ్గు చేటు
  • మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెణి శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట పట్టణానికి గత 4 రోజులుగా మంచినీరు రాక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు,మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందేర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెణి శ్రీనివాస్ అన్నారు.

శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగు రోజులకోసారి మంచినీరు సరఫరా చేస్తే పట్టణ ప్రజల గొంతు తడిచేదెలా అని ప్రశ్నించారు. పట్టణ అవసరాలకు కావలసిన నీటిలో సగంలోపే  మంచినీరు సరఫరా వ్యవస్థలు సరఫరా చేస్తుండటంతో వార్డు ప్రజలు ఇక్కట్లు ఎదురుకొంటున్నారు. రెండు, మూడు రోజులు కొన్ని చోట్ల వారానికి ఓ సారి వచ్చే పావుగంట, అరగంట సరఫరా చేస్తున్న నీటితోనే ప్రజానీకం సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రోజు తప్పించి రోజు గంటన్నర ఇచ్చినప్పుడే బాగుండేదని ప్రజలు అనుకొంటున్నారని, మంచినీటి సరఫరాలో ప్రభుత్వం విఫలం అయింది అని మోటార్లకు రిపేర్ వస్తే నాలుగు రోజులు నల్లనీళ్లు ఇవ్వట్లేదని గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ కాంగ్రెస కౌన్సిలర్లు కౌన్సిల్ మీటింగ్ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పినా చేయలేదని , ట్యాంకర్లతో తూ తూ మంత్రంగా వార్డుకు ఒకటి లేదా రెండు ట్యాంకర్లతో పంపిస్తే నీరు సరిపోవట్లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన దోసపహాడ్ ఫిల్టర్ బెడ్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వేములకొండ పద్మ,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నెల్లుట్ల లింగస్వామి,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొలగాని బాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.