ఉచిత విద్యుత్ పై అనుచిత  వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు

ఉచిత విద్యుత్ పై అనుచిత  వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు

మునగాల ముద్ర:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమానికి రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ బుధవారం పిలుపునివ్వడంతో, మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మునగాల మండల  బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రాంతం మొత్తం చీకటిమయమవుతుందని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిండు శాసనసభలో ప్రకటిస్తే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించిన తర్వాత  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరాయంగా ఉచిత విద్యుత్తును అందిస్తుంటే, కళ్ళుండి చూడలేని కబోదులాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాటి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినట్లే పోరుగు దేశంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఆత్మ అభిమానాన్ని కించపరిచేలా రాష్ట్ర రైతులకు 24 గంటల విద్యుత్తు  దండగా మూడు గంటల విద్యుత్ చాలని దివాలా కోరు మాటలు మాట్లాడటం సరైనది కాదని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పట్ల మరియు వ్యవసాయం పట్ల చిన్న చూపుతో మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం చూస్తుందని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని వారన్నారు, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగం పట్ల మరియు ఉచిత విద్యుత్ పై మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలని  ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల యుగేందర్ రెడ్డి, ఉడుం కృష్ణ, తో గరు సీతారాములు, గన్న నరసింహారావు, ఎల్ పి రామయ్య, నల్లపాటి నాగరాజు, ఎల్ పి వెంకయ్య, చిర్రా శ్రీను, నవీన్ రెడ్డి, ఎల్ రాజేష్, కొండా రామాంజనేయులు, గురుమూర్తి, శ్రీను, ప్రభాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.