కర్ర సహయంతోనే కరెంట్ సరఫరా పట్టించుకోని విద్యుత్ సిబ్బంది

కర్ర సహయంతోనే  కరెంట్ సరఫరా పట్టించుకోని విద్యుత్ సిబ్బంది

మునగాల ముద్ర:-కర్ర సహయంతోనే కరెంట్ సరఫరా చేస్తున్న ఘనత మన మునగాల కరెంట్ అధికారులకె దక్కింది. ముకుందాపురం గ్రామంలో గత నెల రోజుల క్రితం గ్రామానికి సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్స్ మెల్, ఫీమేల్ సమస్యతో మంటలు వస్తుండటంతో గ్రామస్తులు కర్రని ఎత్తుగా పెట్టివుంచారు. గాలి వచ్చినప్పుడు కర్ర ఉడి కింద పడటంతో ఇంట్లో కరెంట్ వచ్చి పోవడం  వల్ల ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు కలిపోతున్నాయని తెలిపారు. వర్షం వస్తే కరెంట్ రవడంలేదన్నారు. గ్రామ ఎల్పర్, లైన్ మెన్ కి ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. గ్రామంలో చాలా చోట్ల చెట్లు కరెంట్ వైర్లకు తగిలి నిప్పు రవ్వలు రావడం జరుగుతుందని తెలిపారు. అధికారులు నెల నెల బిల్లులు కట్టించుకుంటున్నారు తప్ప కరెంట్ సమస్యని పట్టించుకోవడం లేదని తెలిపారు. జిల్లాలో విద్యుత్ మంత్రి ఉన్నపటికీ అధికారులు నిర్లక్ష్యం విడటంలేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కరెంట్ సమస్యని తీర్చాలని కోరుతున్నారు.