తుంగతుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పేరు ప్రకటన

తుంగతుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పేరు ప్రకటన
  • అభ్యర్థి ప్రకటనతో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సంబరాలు జరుపుకుంటున్న బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  పేరు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని  బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు   బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు .ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణ  సంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా  బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నాయకత్వంలో మరోమారు  బిఆర్ఎస్ జండా రెపరెపలాడటం ఖాయమని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అత్యధిక మెజార్టీ సాధించనున్నారని వారన్నారు.

నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటున్న ఎమ్మెల్యేకు విపక్షాలలో అభ్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం  బిఆర్ఎస్ పార్టీ దేనిని అన్నారు. తుంగతుర్తి మండలం లో గతంలో కన్నా టిఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టంగా ఉందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అభ్యర్థి ప్రకటనతో నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల  బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు టిఆర్ఎస్ నాయకులు దొంగరి శ్రీనివాస్ కటకం వెంకటేశ్వర్లు చెరుకు పరమేశ్వర్ గోపగాని శ్రీనివాస్ తో పాటుపలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.