బోనమెత్తిన ఏఎన్ఎంలు.... రెగ్యులర్ చేయాలని నిరసన

బోనమెత్తిన ఏఎన్ఎంలు.... రెగ్యులర్ చేయాలని నిరసన

ముద్ర ప్రతినిధి,జగిత్యాల:రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఏఎన్ఎంల రిక్రూట్మెంట్డు కోసం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ ను రద్దు చేసి 16 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 6 రోజులుగా  జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏ ఎన్ ఎం లు సమ్మె చేస్తున్నారు.  సోమవారం బోనాలు ఎత్తుకుని సమ్మె శిబిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తరలివచ్చిన ఏఎన్ఎంలు నిరసన తెలిపారు.ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన మాదిరిగా తమని కూడా గుర్తించాలని కోరారు.డిమాండ్లు నెరవేర్చాలని గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మధురిమ ఆవేదన వ్యక్తం చేశారు.ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకోవడం లేదని మండిపడ్డారు. నోటిఫికేషన్ రద్దు చేసి, ఏలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని  డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడితే  హక్కులు సాధించుకోవచ్చని తెలిపారు.నిరసనలో మధురిమ,ఎలిజబెత్ రాణి, రమాదేవి,  మేరీ, పి.శిరీష, ఏ.పద్మ, కోమల, శిరీష, జమున, శారద, చిలుకమ్మ, నీరజ, స్వరూప, గణిత,ఊర్మిళ, సరోజ, రజిత, సరోజ, సౌజన్య,సుశీల,సునీత,సంధ్య, జయప్రద, పుష్ప, సమతా, రజితబాయి, సుమలత, భాగ్య, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.