జగిత్యాల మోస్తారు వర్షానికి జలమయం అయిన రోడ్లు 

జగిత్యాల మోస్తారు వర్షానికి జలమయం అయిన రోడ్లు 

జగిత్యాల మున్సిపల్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన అధికారులు 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు పడనప్పటికి మోస్తారు వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం భారి వర్షం పడగ రోడ్లు జలమయం అయ్యాయి.. కొద్ది సేపు మురికి కాలువలు పొంగి పొర్లాయి. ముసురుకు చాల వరకు  ప్రజలు ఇళ్ళకు పరిమితం అయ్యారు. జిల్లా ఆవరేజ్ గా 16.4 సెంటి మీటర్లు నమోదు కాగా జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీం పట్నం మడలంలో 28.1 సెంటి మీటర్లు నమోదు అవగా గొల్లపల్లిలో అత్యల్పంగా 10.3 సెంటి మీటర్లు నమోద్ అయింది. జగిత్యాలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ నరేష్ తెలిపారు. నీటి సరపరా, వీధి దీపాల అంతరాయం, పారిశుధ్య అత్యవసర విధుల కోసం ప్రత్యేక సిబ్బందిని, 24 గంటల పాటు అత్యవసర సేవలకోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 అత్యవసర సమయంలో పట్టణ ప్రజలు  ఉదయం 6 గంటల  నుంచి సాయంత్రం 6 గంటల  వరకు జే. రాజేష్ 9550333241, సాయత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కే. మనోజ్ కుమార్ 8885881808 లు అందుబాటులో ఉంటారని వీరితో పాటు పట్టణంలో శిధిలావస్థలో ఉన్న భవనాల కూల్చివేత గురించి టిపిఎస్ జి. తేజస్విని 951554590 సంప్రదించాలని కోరారు. అలాగే పలు విభాగాలకు చెందిన 15 మందిని అత్యవర సేవలకోసం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.