వేరే రాష్ట్రాల్లో రహదారులు అధ్వానం ... 

వేరే రాష్ట్రాల్లో రహదారులు అధ్వానం ... 
  • అభివృద్ధిలో తెలంగాణ ముందుకుపోతుంది..
  • మల్యాలలో మంత్రి కొప్పుల


ముద్ర, మల్యాల: తెలంగాణతో పోల్చితే వేరే రాష్ట్రాలు... ముక్యంగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రహదారులు పూర్తిగా అద్వానంగా ఉన్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మల్యాల బ్లాక్ నుంచి పెగడపల్లి వరకు రూపాయలు 20 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శనివారం ఎమ్మెల్యే రవిశంకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ 8 ఏండ్లలో తెలంగాణ అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెంది, దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. అడ్డగోలుగా మాట్లాడేవారికి రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పాలని, మంచి ప్రభుత్వాన్ని కాపాడే భాద్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ నిధుల కోసం కృషి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసి కొండపల్కల రామ్మోహన్ రావు, ఎంపిపి మిట్టపల్లి విమల, స్థానిక సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, మండల అధ్యక్షులు జనగాం శ్రీనివాస్, సింగల్విండో అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్ రావు, సర్పంచులు బద్దం తిరుపతిరెడ్డి, రౌతు రవివర్మ, ఎడిపల్లి అశోక్, రాంపూర్ తిరుపతిరెడ్డి, నాయకులు రమణారావు, కోటేశ్వరరావు, కొంక నర్షయ్య, తదితరులు పాల్గొన్నారు. 


ఇవి సెంట్రల్ నిధులు...
మల్యాల బ్లాక్ చౌరస్తా నుంచి పెగడపల్లి వరకు చేపట్టే డబల్ రోడ్డు విస్తరణకు 20 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులని బిజేపి మల్యాల మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రావణ్, ప్రధాన కార్యదర్శి గాజుల మల్లేశం తెలిపారు. ఈ మేరకు స్థానిక సర్పంచ్ సుదర్శన్ తమకు ఆహ్వానం పలికినట్లు శ్రావణ్ పేర్కొన్నారు.