తుతు మంత్రంగా మున్సిపల్ సాదారణ సమావేశం

తుతు మంత్రంగా మున్సిపల్ సాదారణ సమావేశం
  • 4.5 లక్షల్లో అక్రమాలు.. కార్మికుల అక్రమ నియామకాలు
  • ఎజెండా అంశాల అవకతవలఫై కలెక్టర్ కు పిర్యాదు చేసిన కౌన్సిలర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ సమవేశ మందిరంలో చైర్మన్ గోలి శ్రీనివాస్ అధ్యక్షతన మున్సిపల్ సాదారణ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కౌన్సిల్ పలు అంశాల తీర్మానాలను ఆమోదించింది. ఈ సమావేశములో మునిసిపల్ కమీషనర్ బి. నరేష్, మునిసిపల్ ఇంజనీర్ జె. రాజేశ్వర్,  మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీయర్లు శరణ తేజ, అనిల్, టి.పి.ఓ. శ్రీనివాస్, టి.పి.ఎస్. జి.తెజశ్విని, సానిటరీ ఇన్స్ పెక్టర్ బాల యెల్లం, జె.ఏ.ఓ. గణేష్, మునిసిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యలు, కో ఆప్షన్ సభ్యలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

4.5 లక్షల్లో అక్రమాలు ... నియామకాలు
హనుమండ్ల జయశ్రీ , కౌన్సిల్ సభ్యురాలు

అయితే మున్సిపల్ ఎజెండాలో పొందుపరచిన అంశాలకు వాస్తవ పరిస్థితులకు తేడాలు ఉన్నాయని, అవకతవకలఫై విచారణ జరుపాలని కౌన్సిల్ సభ్యురాలు హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్ కు పిర్యాద్ చేశారు. ఈ సందర్బంగా జయశ్రీ మాట్లాడుతూ సానిటీషన్ విభాగంలో  కొత్త కౌన్సిల్ ఏర్పడ్డ సమయంలో సానిటేషన్ లేబర్ 215 మంది ఉండగా మరో 30 మందిని కలెక్టర్ అనుమతితో పేపర్ ప్రకటన ద్వారా తీసుకోగా  మొత్తం 245 మంది లేబర్ ఉన్నారు. కాగా రెగ్యులర్ పిహెచ్ వర్కర్స్ 48 మందితో మొత్తం 293 మంది మాత్రమే ఉండాలి కానీ 304 మందిగా ఏవిధంగా చూపుతున్నారని ప్రశ్నించారు. 11 మంది ఎక్కువగా చూపడం వారివద్ద నుంచి  ఒక్కొక్కరి దగ్గర రూ. 1.50 లక్షలు  తీసుకొని అక్రమ నియామకం చేసారన్నారు.  పనిచేస్తున్నది కేవలం 293 మంది మాత్రమే ఎజెండాలో 304 మందికి  పొందుపరచి సబ్బులు, నూనె, చెప్పులు కోగోనులు  ఖర్చు రూ. 2,67,520  చేయాల్సి ఉండగా  రూ. 3,50,000 ఆమోదం కొరకు పెట్టారు. ఇక్కడ రూ. 82,480  అదనంగా చూపి కౌన్సిల్ ను తప్పుదోవ పట్టించారని అన్నారు. దుస్తువుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, చీపుర్ల కొనుగోలులో సైతం  రూ. 3,74, 896  తేడా చూపించారని అన్నారు . లక్షల్లో అక్రమ లెక్కల ఫై విచారణ జరిపి బాధ్యులఫై చర్యలు తీసుకోవాలని సభ్యురాలు జయశ్రీ కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాద్ లో కోరారు.