గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు

గంజాయి,మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు కటిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్  అన్నారు.  గంజాయి అమ్ముతున్న వ్యక్తులను పట్టుకొని, గంజాయి స్వాధీనం చేసుకున్న ఎస్.ఐ ఉమాసాగర్, ఏ ఎస్ ఐ ప్రకాష్ లను జిల్లా పోలిస్ కార్యలయంలో ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతు పక్క జిల్లాల నుంచి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో,కలశాలలో గంజాయ ,మత్తు పధార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిరహిస్తున్నామని అన్నారు. గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని  తెలిపారు.