పట్టణ ప్రజలు పల్లెల వైపు చూస్తున్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్

పట్టణ ప్రజలు పల్లెల వైపు చూస్తున్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : గతంలో పట్టణాలకు ,నగరాలకు వలస వెళ్లిన వారు గ్రామాలకు తిరిగి వచ్చే పరిస్తితి ఏర్పడ్డది అని,వ్యవసాయ రంగం లో అనేక వసతుల కల్పన ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గ స్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవం 2023 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం జారి చేసిన అవార్డులను అందజేసి అబినంధించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వ‌చ్ఛ భార‌త్ లో మ‌రోసారి తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌ గా నిలిచిందని సిఎం కెసిఆర్ చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌థ‌కం ప్ర‌గ‌తి ఫ‌లాలే ఈ అవార్డులు అని అన్నారు. సిఎం కెసిఆర్ గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ లో ప్ర‌క‌టించే ప్ర‌తి అవార్డుల్లోనూ తెలంగాణ ప్రథమ స్థానాల్లో నిలుస్తూనే ఉంది.

గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు వ‌స్తూనే ఉన్నాయి. ఈ అవార్డులు రావ‌డంలో ప్రజా ప్రతినిదులు,అధికారుల కీలకం అని అన్నారు. మహాత్మా గాంధీ పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు అని అన్నారని దానికి అనుగుణంగా బాపూజీ ఆశయాల మేరకు సిఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం లో గ్రామాలను అభివ్రుది చేస్తున్నారు అని అన్నారు. పల్లె ప్రగతి ఒక గొప్ప కార్యక్రమం అని,నేడు పల్లెలు పచ్చదనం ,పరిశుభ్రత తో కళ కలలాడుతున్నాయి అని అన్నారు. గ్రామాల్లో పార్కులు,వైకుంఠ దామాలు, కంపోస్టు షెడ్డు, ట్రాక్టర్, ట్యాంకర్ ఏర్పాటు చేయటం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు,జెడ్పీటీసీ లు, వైస్ ఎంపీపీలు, ఎంపివో లు, ఎంపిడివోలు,సర్పంచులు,ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, ప్రజా ప్రతినిదులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.