నేనున్నా భరోసాగా ఉండండి

నేనున్నా భరోసాగా ఉండండి
  • పంట నష్టాన్ని పరిశీలిస్తున్న కేసీఆర్
  • నేరుగా రైతులతో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రామడుగు మండలం రామచంద్రపురం గ్రామంలో కర్బూజా పంట వేసిన రైతులతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పంట నష్టం పై అడిగి తెలుసుకున్నారు. నేనున్నా మిమ్మల్ని ఆదుకుంటా భరోసాగా ఉండండి అంటూ వారికి అభయమిచ్చారు. ఎకరాకు 10వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ ను ఆదేశించారు.

నర్సంపేట నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్ కు చేరుకున్నారు. వీరికి మంత్రి గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్  స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లు ఉన్నారు.