స్థంభంపల్లిలో ఇథనాల్ ప్రాజెక్టు పనుల అడ్డగింపు..

స్థంభంపల్లిలో ఇథనాల్ ప్రాజెక్టు పనుల అడ్డగింపు..
  • పనులు జరుగున్న ప్రాంతానికి భారీగా చేరిన స్థంభంపల్లి, పాసిగామ ప్రజలు
  • పనులను జరిపేది లేదని ముక్త కంఠంతో   తిరుగుభాటు
  • బుద్దుడు నడయాడిన నేల కాలుష్యం కోరల్లో  చిక్కుకోనుం దని   ఆవేదన 
  • ప్రాజెక్టును ఆపే విషయంపై  రెండు గ్రామాలల్లో ప్రజల చర్చలు  

 

వెల్గటూర్,ముద్ర:  వెల్గటూర్ మండలం లోని స్థంభంపల్లి గ్రామ శివారులో క్రిబ్ కో కంపెనీ ఆధ్వర్యంలో ఇథనాల్ ప్రాజెక్టు సంభంధించిన పనులు జరుగుతుండగా బుధవారం స్థంభంపల్లి, పాసిగామకు సంబంధించిన ప్రజలు అడ్డగించారు.
పనులు జరుగున్న చోటికి రెండు గ్రామాలకు సంబంధించిన మహిళలు, రైతులు  భారీగా తరలి వచ్చి కంపనీకి సంబంధించిన పనులను జరిపేది లేదని ముక్త కంఠంతో   తిరుగుభాటు చేశారు. ప్రాజెక్టును ఆపేందుకోసం ఉదయం నుంచి రెండు గ్రామాలల్లో జోరుగా చేర్చలు  జరిగాయి.

జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామశివారులో క్రిబ్ కో కంపెనీ ఆధ్వర్యంలో ఇథనాల్ ప్యాక్టరి నిర్మాణం జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసినదే కానీ ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే వాతావరణం, జల కాలుష్యం జరుగుతుందని, ఉన్న కాస్త ప్రభుత్వ భూమిని  ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తే మా పరిస్థితి ఏందని గత ఐదు రోజుల నుంచి స్తంభంపల్లి, పాసిగామ ప్రజలు ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారు." బుద్ధుడు" నడయాడిన నేలగా ప్రసిద్ధికెక్కిన  ఈ ప్రాంతం పర్యాటక కేంద్రం గా విలసీల్లాల్సింది పోయి, కాలుష్యపు కోరల్లో చిక్కుకొనుందని దానిని మేం సహించభోమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ప్రాజెక్టు నిర్మాణాన్ని జరగనివ్వమని తెగేసి చెప్తున్నారు. 1090 సర్వే నెంబర్ లో గల భూమిలో కంపెనీ వారు  "సాయిల్ టెస్ట్" చేస్తున్నారని తెలుసుకొని  రెండు గ్రామాల ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. మిషన్ల ముందు ఆందోళన చేపట్టారు. ఎండను లెక్కచేయకుండా భారీ నిరసన తెలియజేశారు.ఈ క్రమంలో ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. ఇ క్కడి పరిస్థితి చిలిపి చిలికి గాలి వానగా మారి అటు ప్రజలకు ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది