ఘనంగా పెద్దమ్మ తల్లి పునఃప్రతిష్ఠ

ఘనంగా పెద్దమ్మ తల్లి పునఃప్రతిష్ఠ
  • గ్రామంలో  అమ్మవారి ఊరేగింపు
  • సంప్రదాయంగా పోతరాజుల  విన్యాసాలు
  • బోనాలు సమర్పించిన మహిళలు

మెట్‌పల్లి, ముద్ర:- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి పునఃప్రతిష్ఠ  మహోత్సవం కనుల పండువగా జరిగింది. అమ్మవారిని ప్రత్యేక వాహనం లో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులు, బోనాలతో  ఆలయం వద్దకు డప్పుచప్పులతో ఊరేగింపుగా వెళ్లారు. గ్రామ కూడళ్లు, పోలిమేరలలో పోతరాజులు సంప్రదాయ పూజలు నిర్వహించి ఇర గోళతో విన్యాసాలు చేసి  అలయంలో అమ్మవారిని  పునఃప్రతిష్ఠ  చేశారు. మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  సర్పంచ్ సున్నం నవ్యశ్రీ, ఎంపీటీసీ దేశెట్టీ మమత, యామపుర్ సహకారసంఘం చైర్మన్ అంకతి రాజన్న, నాయకులు సున్నం సత్యం, దేశెట్టీ రాజరెడ్డి, అయాసంఘల పెద్దలు అప్పని చిన్న గంగారాం, అంకతి శేఖర్, రౌతు రాజరెడ్డి పాల్గొన్నారు.