రాజమండ్రిలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం  

రాజమండ్రిలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం  

రాజమండ్రిలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.  ఆయన మహానాడులో మాట్లాడుతూ ఈ సారి మహానాడుకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. రాజమహేంద్రవరం ఎన్​టీఆర్​ మెచ్చిన నగరమని అన్నారు. ఎన్​టీఆర్​ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని బాబు అన్నారు. ఎన్​టీఆర్​ వందో ఏటా మహానాడు జరుపుకుంటున్నామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ చిరునామా అని అన్నారు. సైకిల్​ గుర్తు సామాన్యుడి శ్రమకు గుర్తింపు అన్నారు. సైకిల్​కు ఎలక్ట్రిక్​ హంగులు తీసుకొచ్చాం. ఇక దూసుకుపోతాం. నాలుగేళ్లు టీడీపీ కుటుంబ సభ్యులు త్యాగాలు చేశారు. నాలుగేళ్ళు కార్యకర్తల ఉక్కు సంకల్పంతో సైకిల్​ ముందుకు వెళుతోంది. ప్రాణం తీస్తామని బెదిరించినా కార్యకర్తలు వెనకడుగు వేయలేదు. ప్రాణ సమానులైన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వందనం చేస్తున్నానని చెప్పారు చంద్రబాబు. జీవితంలో చూడని ఉత్సాహం, అభిమానం మీలో కనిపిస్తోందని అన్నారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకువెళతాం. త్వరలో ఎన్​టీఆర్​ శకం ప్రారంభమవుతుంది. తెలుగుజాతి ప్రపంచంలో ప్రతిభావంతమైన జాతిగా చాటి చెప్పిన నాయకుడు ఎన్​టీఆర్​ అని అన్నారు.