ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వట్లేదు : కిషన్​ రెడ్డి 

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వట్లేదు : కిషన్​ రెడ్డి 

ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, అప్పులు ముంచుకొస్తున్నాయని, ఆదాయానికి మించి సీఎం కేసీఆర్ అప్పులు చేశారని, కేసీఆర్ కుటుంబానికి అప్పుల దాహం తీరడం లేదంటూ కిషన్ రెడ్డి ఏకిపారేశారు.  నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. నీతి అయోగ్ 8వ సమావేశానికి సిఎం కేసీఆర్ హాజరు కాలేదు. హెల్త్, ఊమెన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లపై చర్చ సాగుతోంది. టీమ్ ఇండియా స్పిరిట్ తో సమావేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

‘భూములు అమ్మడంతో కేసీఆర్ ఆకలి తీరడం లేదని, 111 జీవో రద్దుతో హైదరాబాద్ నగరానికి ఎప్పుడైనా ప్రమాదం ఎప్పుడైనా పొంచి ఉంది, అసైన్డ్ భూములను అమ్ముకుంటున్నారు’ అంటూ విమర్శలు చేశారు. ‘వరంగల్ జైలు భూములను తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి 10 ఏకరాల భూమిని కేసీఆర్ కేటాయించారు. రియల్ ఎస్టేట్ కోసమే 111 జీవో రద్దు చేశారంటూ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా విమర్శలు గుప్పించారు. బ్రిటన్ లాంటి దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరుకున్నామని, నీతి ఆయోగ్ సమావేశం కన్నా సీఎం కేసీఆర్‌కి అతి ముఖ్యమైన పని ఏముంటందని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘దేశ్ కి నేత కావాలనుకునే నేత.. దేశ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న చర్చలో పాల్గొనాలని తెలియదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం కేసీఆర్‌కి సోయి లేదంటూ ఘాటుగా మాట్లాడారు.