తొర్రూరు, గూడూరు కు ఆర్టీసీ బస్సులు నడపాలి

తొర్రూరు, గూడూరు కు ఆర్టీసీ బస్సులు నడపాలి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం నుంచి తొర్రూరు, గూడూరు మండలాలకు గతంలో నడిచిన ఆర్టిసి బస్సు సర్వీసులను తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ చైల్డ్, ఉమెన్ ఆర్గనైజేషన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఆర్టీసీ డిఎం విజయ్ కి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా గుర్తింపు పొందిన కేసముద్రం మండలానికి నిత్యం వందలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే ఏ సముద్రం రైల్వే స్టేషన్ ద్వారా తొర్రూరు నెల్లికుదురు గూడూరు ప్రాంతాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. తొర్రూరు గూడూరు నుంచి కేసముద్రం మండలానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించి గూడూరు, తొర్రూరు మార్గంలో కేసముద్రం ద్వారా ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించాలని కోరారు. డిపో మేనేజర్ ను కలిసిన వారిలో కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ సోమారపు శ్రీరాములు, కేసముద్రం మండల ప్రెసిడెంట్ పింగిలి రవీందర్ తదితరులున్నారు.