ఆలయ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు

ఆలయ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు

దేవాధాయశాఖ ఈ ఓ వేణుగోపాల్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: దేవాలయ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి పి. వేణుగోపాల్ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామ మందిరం యొక్క 476,477,479,480,481 సర్వే నెంబర్లలో విస్తీర్ణం  9-09 ఎకరాల భూమిలో గురువారం ఆలయ ఈఓ పి. వేణుగోపాల్, ఆలయ చైర్మన్  కాశెట్టి తిరుపతిలు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ ఈ.ఓ పి.వేణుగోపాల్ మాట్లాడుతూ దేవాలయ భూములలో అక్రమణలకు, అక్రమ దారులకు చోటు లేదని చెబుతూ అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు. అక్రమ దారులపై శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాయ దేవాలయ రేనోవేషన్ కమిటీ సభ్యులు నర్సింగరావు , రాజేశ్వర్ రెడ్డి, శంకర్, గోపాల్ నాయక్ దేవాదాయ శాఖ సిబ్బంది కోండ్ర రవి, భార్గవ్ , అర్చకులు గోపాల్ , శశాంక్ , మౌళి తదితరులు పాల్గొన్నారు.