విచారణ చేపట్టకుండానే  పోలీసులు నాన్ బెయిలేబుల్ కేసులు పెడుతున్నారు..

విచారణ చేపట్టకుండానే  పోలీసులు నాన్ బెయిలేబుల్ కేసులు పెడుతున్నారు..

                 *  కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్              

ముద్ర, వెల్గటూర్ : జగిత్యాల, జిల్లా,ధర్మపురి నియోజక వర్గంలో గల పోలీసులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒత్తిడితో ఎటువంటి విచారణ చేపట్టకుండానే  అమాయకుల పై నాన్ బేయిలేబుల్ కేసులను  పెట్టి, జైలుకు  పంపిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం వెల్గటూర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వెల్గటూర్ మండలంలోని చెగ్యాం గ్రామ మాజీ సర్పంచ్ చెన్న పొన్నం కాంగ్రెస్ జెండా పట్టడమే పాపం అన్నట్లు ఆయనను నాలుగు కేసులల్లో ఇరికించారని పేర్కొన్నారు. చెన్న పున్నం,  చెన్న మల్లయ్యకు పాలేరు విషయం లో గొడవ జరుగగా చెన్న మల్లయ్య ఆయన భార్య పు న్నం పై దాడి చేశారని, చినిగిన బట్టలు, గాయలతో పోలీస్ స్టేషన్ కు వచ్చాడని అన్నారు. కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామన్న ఇంచార్జ్ ఎస్సై మంత్రి వద్ద నుంచి ఫోన్ రావడంతో మాట మార్చారని అన్నారు. గాయలతో వచ్చిన పున్నం పై ఎటువంటి విచారణ చేయకుండా, పిటిషన్ ఆధారంగా నాన్ బేయిలేబుల్ కేసుపెట్టి జైలుకు పంపించారని,  ఎదుటి వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ లు చట్టానికి లోబడి పని చేస్తున్నారా లేక మంత్రికి పని చేస్తున్నార అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో పోలీసు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పాటు మానవ హక్కుల కమీషన్,  హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చె న్న పున్నం భార్య జమున మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ తన భర్తను బీఆర్ఎస్ పార్టీలో చేరమణి ఒత్తిడి చేసిన అతను చేరకపోవడంతో తనపై కక్ష కట్టి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా మంత్రి ఈశ్వర్ బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు మురళి గౌడ్, గోల్ల తిరుపతి, దావుల శశి, గుమ్ముల వెంకటేష్, బరపాటి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.