జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు తాటిపల్లి విద్యార్థి ఎంపిక

జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు తాటిపల్లి విద్యార్థి ఎంపిక

ముద్ర, మల్యాల: ఈనెల 6 నుంచి 8 వరకు అనంతపూర్ లో జరిగే 13వ మిని సబ్ జూనియర్ నేషనల్ సాప్ట్ బాల్ ఛాంపియన్షిప్ (అండర్13 విభాగంలో) తెలంగాణ టీం కి జడ్పిహెచ్ఎస్ తాటిపల్లి విద్యార్థి కొత్తపల్లి వివేక్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కండ్లే గౌతమ్ కృష్ణారావు నేషనల్ కు సెలెక్ట్ అయిన విద్యార్థితో పాటు పిఈటీ ఈరు భీరయ్యను అభినందించారు. అలాగే  సర్పంచ్ బింగి జోష్ణవేణు,  పలువురు ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు, పాఠశాల సిబ్బంది కూడా విద్యార్థిని అభినందించారు.