కన్నుల పండుగ దుబ్బ రాజన్న కళ్యాణం...

కన్నుల పండుగ దుబ్బ రాజన్న కళ్యాణం...

ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన  అదనపు కలెక్టర్ మకరంద్...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సారంగపూర్ మండలం శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవమూర్తులైన శివపార్వతులను భాజపతింద్రుల మధ్య పల్లకిలో ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకురాగ, స్వామివార్లకు ప్రభుత్వం తరఫున జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

కళ్యాణ వేదికపై ఆసీనులైన ఉత్సవమూర్తులకు వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాలు, మంగళ వాయిద్యాలు మధ్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కనువిందు చేసిన ఈ కళ్యాణానికి పెంబట్ల, కోనాపూర్ గ్రామాలతో పాటు జగిత్యాల, సారంగపూర్ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, సర్పంచ్ బి. రాజన్న ఆలయ చైర్మన్ పొరండ్ల శంకరయ్య ఈవో కాంతారెడ్డి, గురునాథ మల్లారెడ్డి తోడేటి శేఖర్ గౌడ్, తోడేటి గోపాల్ కిషన్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.