దుబ్బ రాజన్న స్వామి జాతరకు పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

దుబ్బ రాజన్న స్వామి జాతరకు పటిష్టమైన బందోబస్తు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  మహాశివరాత్రి పురస్కరించుకొని సారంగాపూర్ మండలం పెంపట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి జాతరకు  పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ. భాస్కర్ తెలిపారు.   మూడు రోజులపాటు జరిగే దుబ్బ రాజన్న జాతరలో  పార్కింగ్ ప్రదేశాలను,  వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను జిల్లా ఎస్పీ పరిశీలించి బందోబస్తు పర్యవేక్షించారు. 

ఈ సందర్భంగాఎస్పీ  గారు మాట్లాడుతూ జాతర సందర్భంగా  పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, సీసీ కెమెరాల ద్వారా  నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్  ను సంప్రదించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ దుబ్బ రాజన్న స్వామిని  ప్రశాంతంగా దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం ఆలయంలో స్వామీ వారిని దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జిల్లా ఎస్పీ  వెంట డీఎస్పీ ప్రకాష్ , రూరల్ సీఐ  కృష్ణకుమార్ , అరిఫ్ అలీ ఖాన్ , సారంగాపూర్ ఎస్సై మనోహర్రావు ఉన్నారు.