సమస్యల పరిష్కరానికే మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం

సమస్యల పరిష్కరానికే మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి,జగిత్యాల : సమస్యల పరిష్కరానికే మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని 31, 13వ వార్డుల్లో మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డా. సంజయ్ వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ జెండాను స్థానిక నాయకులతో కలసి ఆవిష్కరించారు. అనంతరం వార్డుల ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జెండా మహేళా వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో జగిత్యాల పట్టణం ఆస్తవ్యస్తంగా తయారైందని, పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అన్ని వార్డుల్లో అభివృద్ధికి పనులకు విధులు కేటాయిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తుందన్నారు. 

తెలంగాణలో అమలవుతున్న రైతుబందు. రైతుబీమా, ఉచిత విద్యుర్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో గురుకులాల ఏర్పాటుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతులను కల్పిస్తున్నామని, జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసి ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని, ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటారవి, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

మైనార్టీల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిపై లక్షకు పైగా ఏడాదికి ఖర్చు చేస్తుందని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ పథకంలో అండగా ఉంటున్నామని, మస్జీద్ల్లో పనిచేసి ఇమామ్. మౌజన్లకు గౌరవ వేతనం అందిస్తున్నామని, ఓవర్సీస్ స్కాలర్షిప్తో మైనార్టీల విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు అండగా విలుస్తున్నామన్నారు. ప్రతిపక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, జగిత్యాల పట్టణాన్ని గత ఐదేళ్ల కాలంలో శక్తివంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తున్నానని. రామన్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎప్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, కోఆప్షన్ సభ్యులు రియాజ్ మామ, సీనియర్ నాయకులు అమీన్ ఉల్ హాసన్, నాయకులు రిజ్వాస్, కమల్, ఖాజా సుల్తానోద్దీన్ అహ్మద్, ఏత్తేమాద్. సాదిక్, షజ్డ్ ఫెరోజ్ ఖుతుబ్, జోహేబ్ వార్డు యువకులు పాల్గొన్నారు.