స్కూల్ బస్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి...

స్కూల్ బస్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి...

ప్రమాదాలు జరిగితే డ్రైవర్లు, యాజమాన్యం పై కేసులు నమోదు: డిఎస్పీ రవీందర్ రెడ్డి

మెట్‌పల్లి ముద్ర: విద్యాసంస్థల వాహనాలకు తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ జారి చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి కలిగి ఉండాలని డిఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా స్కూల్ బస్సుకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్కూల్స్ బస్ లకు సంబంధించి అన్ని వాహన పత్రాలు కలిగి ఉండాలని, బస్సు సరైన కండిషన్ లో ఉందో లేదో ముందే చెక్ చేసుకొని జాగ్రత్త పడాలని, వర్షాకాలంలో డ్రైవర్ లు అప్రమత్తంగా లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్కూల్ బస్సుల్లో చిన్న పిల్లలే ప్రయాణిస్తారని, చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలని సూచించారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు తో పాటు యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.

Also Read:  

పిల్లలని స్కూల్ కి తీసుకొని వచ్చేటప్పుడు, ఇంటికి తీసుకొని వెళ్లే క్రమంలో బస్సు హెల్పర్ వెనుక, ముందు చూసుకున్న తరువాత వారిని బస్సు నుండి దింపాలి, పిల్లలు రోడ్డు దాటవలసివస్తే హెల్పర్ తప్పక దాటించాలని సూచించారు. వర్షా కాలంలో బస్సు బ్రేక్, లైట్స్, ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్ మరియు వైపర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చూసుకోవాలని సూచించారు. మద్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. డివిజన్ లో నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై పోలీస్, ఆర్టీఏ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ సీజ్ చేస్తామన్నారు. డాక్టర్ అంజిత్ కుమార్ డ్రైవర్ లకు హార్ట్ ఎటాక్ పై అవగాహన కల్పించారు. సి పి ఆర్ పద్దతి ద్వారా గుండె మళ్ళీ పనిచేసే విధానాన్ని, ప్రథమ చికిత్సను ఎలా అందిచాలనే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సి ఐ లక్ష్మీనారాయణ, ఎస్సై లు శ్యామ్ రాజ్, ఉమాసాగర్, నవీన్, మన్మధరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్, పోలీస్ సిబ్బంది, స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు.