గంగమ్మ తల్లికి బోనం సమర్పించిన జడ్పి చైర్ పర్సన్ దావా వసంత 

గంగమ్మ తల్లికి బోనం సమర్పించిన జడ్పి చైర్ పర్సన్ దావా వసంత 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జగిత్యాల పట్టణం లోని గంగమ్మ తల్లి బోనాల మహోత్సవంలో భాగంగా జడ్పి చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గంగమ్మ తల్లికి బోనం సమర్పించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే సతీమణి రాధిక సంజయ్ బోనం సమర్పించగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ కౌన్సెలర్స్ లు సమిండ్ల వాణి శ్రీనివాస్, పద్మ సింగరావు, జంబర్తి రాజ్ కుమార్, నాయకులు అల్లలా దామోదర్ రావు, అల్లలా ఆనంద్ రావు, మనుక గంగారాం యాదవ్, పాక్స్ డైరెక్టర్ ఆరుమూళ్ల గంగారాం , గుమ్ముల అంజయ్య, జంబర్తి శంకర్,బింగి రాజేశం తదితరులు ఉన్నారు.
గంగమ్మ తల్లి దేవాలయం లో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు...
జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేట్ లో గంగమ్మ ఆలయంలో బోనాల  పండుగ కార్యక్రమంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.   ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్సీని శాలువా తో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసి,ఆశీర్వచనాలు ఇచ్చారు. ఎమ్మెల్సి వెంట కౌన్సిలర్స్ బింగి రవి , రజినీకాంత్  బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, జున్ను రాజేందర్ లు ఉన్నారు.