సివిల్స్ లో కోరుట్ల వాసి ప్రతిభ

సివిల్స్ లో కోరుట్ల వాసి ప్రతిభ
  • జాతీయ స్థాయిలో 132 వ ర్యాంక్
  • అభినందించిన ఎమ్మెల్యే, నాయకులు 

మెట్‌పల్లి ముద్ర:- కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 132 ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్ కోసం ఎంపికయ్యారు. శివ మారుతి తండ్రి ఏనుగు అంజిరెడ్డి మల్లాపూర్ మండలం గుండంపల్లి   ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. శివ మారుతి రెండవ ప్రయత్నంలో సివిల్స్ లో ర్యాంకు సాధించగా, ఆయన ఐపీఎస్ కు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. మెట్‌పల్లి పట్టణంలోని నిఖిల్ భరత్ పాఠశాలలో 2014,2015 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన శివమారుతి హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి స్టేట్ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ డిగ్రీ కళాశాలలో బీఏ ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొంది . జాతీయ స్థాయిలో 132 వ ర్యాంక్ సాధించాడు. తన కుమారుడు సివిల్స్ లో ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు అంజిరెడ్డి-పుష్పలత ఆనందం వ్యక్తం చేశారు. 

శివ మారుతి కి పలువురి శుభాకాంక్షలు.

కోరుట్ల మండలం అయిలపూర్ గ్రామానికి చెందిన శివ మారుతి రెడ్డి సివిల్స్ లో జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించడం పట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు,కృష్ణ రావు, కొమిరెడ్డి కరంచంద్, కల్వకుంట్ల సుజీత్ రావు, బిజెపి నాయకులు డాక్టర్ జే ఎన్ సునీత వెంకట్, సురభి నవీన్ రావు, బీఎస్పీ నాయకులు పుప్పాల లింబాద్రీ లు అభినందనలు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం నుండి మరో యువకుడు సివిల్స్ లో ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని. నియోజకవర్గంలోని విద్యార్థులు కష్టపడి చదివి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులగా ఉద్యోగాలు సాధించి నియోజకవర్గానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు.