జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చు..

జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చు..
  • జిల్లా ఫైర్ అధికారి కొమురయ్య.
  • అగ్ని ప్రమాదాల నివారణఫై ఫైర్ సిబ్బంది ప్రదర్శనలు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తగు జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జగిత్యాల జిల్లా ఫై అధికారి సిఎస్ కొమురయ్య అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధమైన చర్యలు చేపట్టాలో సిబ్బందితో కలిసి ఆయన పలు అగ్నిమాపక ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సిలిండర్ మంటలు అంటుకున్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  ఇల్లు, వంటగదిలు పాఠశాలలో, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ తో పాటు గోదాములు, గిడ్డంగులు, తాత్కాలిక నిర్మాణంలో, పందిళ్లు, కర్మగాలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ఏ విధమైన జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమలో ఎల్.ఎఫ్.కే రవీందర్, ఆపరేటర్లు ఎ . మల్లేశం, టి. దత్తురాంసింగ్, ఎఫ్.ఎం బి. శ్రీనివాస్, కే. ప్రశాంత్, కే. నరేష్, కే . మహర్షి, ఎం. వేణు, గంగేష్,  సిబ్బంది పాల్గొన్నారు.

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన  ఎమ్మెల్యే
అగ్ని మాపక శాకలో1944, ఏప్రిల్ 14 న జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది ఫైర్ మెన్ లు మరణించారు. వారి జ్ఞాపకార్థం నేషనల్ ఫైర్ సర్వీస్ డే సందర్భంగా  ఏప్రిల్14 నుంచి 20వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి కొమురయ్య, కౌన్సిలర్లు ముస్కు నారాయణరెడ్డి, చుక్క నవీన్,కమిషనర్ డా.నరేష్, డిఇ  రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.