అభివృద్ధిని చూసి ఓర్వలేకనే  కాంగ్రెస్ నాయకుల విమర్శలు

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే  కాంగ్రెస్ నాయకుల విమర్శలు

వెల్గటూర్,ముద్ర: జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే కాంగ్రెస్ నాయకులు పనికిరాని విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ మండల నాయకులతో కలిసి వెల్గటూర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.   కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో వీధులన్నీ  చెత్త చెదారంతో నిండిపోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రజలు జీవనం సాగించారని విమర్శించారు. కనీస వసతులైన మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్ సదుపాయాలు లేక ప్రజలు అల్లాడిపోయారని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనం, మిషన్ భగీరథ ,స్వచ్ఛ సర్వేక్షన్ లాంటి వినూత్నమైన కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్టంగా చేపట్టి పల్లెలను సుందరంగా తీర్చి దిద్దిన్ దని అన్నారు. స్థానిక కాంగ్రెస్ సర్పంచ్ నేను అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటున్నారు. మీకు నిధులు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, మీరు చేసిన అభివృద్ధి పనులు అన్నింటికీ తెలంగాణ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. మా ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినట్టు ప్రచారం చేయడం సరై ంది కాదన్నారు. వెల్గటూర్ అభివృద్ధి కోసం మేము పాటు పడుతున్నాము. మీరేమో మా వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టాలని చూస్తున్నారు. నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు అందుకే మేము విమర్శించటం లేదన్నారు. త్వరలో స్థానిక ప్రజలే  తగిన బుద్ధి చెబుతారని  సర్పంచిని హెచ్చరించారు. ప్రతినెల గ్రామపంచాయతీకి ఐదు లక్షల రూపాయల నిధులు వస్తున్నాయనే మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉంటున్నాము.          

ఈ లెక్కలు చూడడానికి ఎక్కడికైనా రావడానికి సిద్ధమే, రికార్డులు చూపించే దమ్ము నీకు ఉందా అని  బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు. ప్రతిసారి సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నారు, ఒకసారి రాజీనామా చెయ్ నేను కూడా చేస్తా ప్రజాక్షేత్రంలో తేల్చు కుందామని  బీఆర్ఎస్ నాయకులు  సవాల్ చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి పని చేసేది తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కొప్పుల ఈశ్వర్. అలాంటి వారిపై మరోసారి విమర్శలు చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించు కుంటారని జూపాక కుమార్, పెద్దూరి భరత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ జూపాక కుమార్, కొప్పుల విద్యాసాగర్ పెద్దూరి భరత్ నర్సింగరావు  రంగు తిరుపతి కొప్పుల సురేష్ తదితరులు ఉన్నారు.