ఎల్. శేకర్ ను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్

ఎల్. శేకర్ ను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ  నాయకుడు ఎల్.  శేఖర్  తండ్రి  ఎల్ జి రామ్  ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఎల్ జి రాం చిత్ర పటానికి పూలమాలలు వేసి శేఖర్ కుటుంబ సభ్యులను  మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో కలిసి  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా . బోగ శ్రావణిప్రవీణ్  పరామర్శించారు. వారి వెంట బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, నలువాల అశోక్, గుంటి గంగారాం, మల్లేష్  తదితరులు ఉన్నారు.