ఈవీయంలు బద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ తాళం చేవిలు ఎక్కడ

ఈవీయంలు బద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ తాళం చేవిలు ఎక్కడ
  • తాళం చేవిల గల్లంతుకు బాధ్యులెవరు
  • హైకోర్ట్ ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల విచారణ
  • జగిత్యాల జేఎన్ టియు కళశాలలో రాత్రి 7.30  గంటల వరకు విచారణ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్ టియు కళాశాలలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రిన్సిపాల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ రవి కిరణ్ ముగ్గురు సభ్యుల బృందం స్ట్రాంగ్ రూము తాళం చేవిల మిస్సింగ్ ఫై సుధీర్గ విచారణ చేపట్టింది. తాళం చెవిలు మిస్స్  అయ్యాయని  విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన హైకోర్ట్ తాళాలు మిస్సింగ్ ఫై పూర్తీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల బృందం సోమవారం  జేఎన్ టియు కళాశాలలో విచారణ చేపట్టింది.జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషతో పాటు ఇది వరకు ఇక్కడ పని చేసి బదిలి అయి వెళ్ళిన.. ఈ అంశానికి సంబందం ఉన్న అధికారులకు ఇదివరకే ఎన్నికల అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శరత్ తో పాటు  జగిత్యాలలో పని చేసి బదిలిఫై వెళ్ళిన జిల్లా కలెక్టర్ రవి, అదనపు కలెక్టర్లు రాజేశం, జల్దా అరుణశ్రీ, అప్పటి ధర్మపురి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రిటైర్డ్ డిప్యూటి కలెక్టర్ బిక్షపతితో పాటు ఆ ఎన్నికల సంబంధం ఉన్న అధికారులు హాజరు అయ్యారు.

జేఎన్ టి యు కళాశాల ప్రత్యెక గదిలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఒకరి తర్వాత ఒకరిని సుదీర్ఘంగా విచారించింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల ప్రక్రియ ముగిసాక స్ట్రాంగ్ రూమ్లో ఈవీయంలను భద్రపరిచాక సీలు చేసిన తాళాల తాళం చేవిలు మొదట ఎవరు వద్ద ఉన్నాయి.. వారు బదిలీ అయి వెళ్ళాక ఎవరికిచ్చారు ..ఎక్కడెక్కడ భద్రపరిచారు అనే విషయాలను ప్రశ్నించినట్లు తెలిసింది. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్ పై హైకోర్టు సీరియస్ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. అయితే తాళం చెవులు ఎవరి వద్ద మిస్ అయ్యాయి అనే  అంశాన్ని ఎన్నికల అధికారులు గుర్తించి ఉంటారు. ఈ మేరకు వారిపై హైకోర్టుకు ఒక నోట్ కూడా సమర్పించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అలాగే హైకోర్టు తీసుకుని చర్యలకు ఎవరో ఒకరు పై వెయిట్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల అధికారులకు తనకు జరిగిన అన్యాయం, తాళాల మిస్సింగ్ ఫై పిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మన్ కుమారు వెళ్ళగా పోలీసులు అడ్డుకుని తిప్పి పంపారు. జేఎన్ టి యు కళాశాల సమీపంలోకి ఎవరిని కూడా అనుమతించలేదు. 

అసలు ఎమి జరిగింది...
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ 400 స్వల్ప ఓట్ల తేడాతో  ఓటమి పాలయ్యారు. ఈయనఫై కొప్పుల ఈశ్వర్ గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరగడంతో తాను ఓటమి పొందాను అంటూ  అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2019లో లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ఫై సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో ఈవీఎంలు భద్రపరిచిన జగిత్యాల వీఆర్ కే కళశాల స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను, సిసి ఫుటేజ్ లను  తమకు ఏప్రిల్ 11లోపు  సమర్పించాలని హైకోర్టు జస్టిస్  జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ కు డైరెక్షన్ ఇచ్చింది. అలాగే అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, అడ్లూరి లక్ష్మన్ కుమార్ ఈ ప్రక్రియ జరిగే 10న హాజరు కావాలని జిల్లా కలెక్టర్ వారికీ సమచారం అందిచారు.  ఈమేరకు ఈ నెల10  హైకోర్టు ఆదేశాలతో  జగిత్యాల జిల్లా కలెక్టర్, (జిల్లా ఎలక్షన్ అధికారి) కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మన్ కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతినిధిగా శ్రీకాంత్ రెడ్డి హాజరవగా వారి సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన వి.ఆర్.కే. ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూమ్ ను ఉదయం 10 గంటలకు తెరిచారు.

ఇక్కడే ట్విస్ట్ .... తాళం చేవిలు మిస్
ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదంపై స్ట్రాంగ్ గ్రూప్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను సమర్పించాలని హైకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎన్నికల అధికారి వీఆర్ కే కళాశాలలో ఈవీఏం లు భద్రపరిచి ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను తమ వద్ద ఉన్న తాళం చెవితో తెరిచె ప్రయత్నం చేశారు. అందులో నుంచి ఒక స్ట్రాంగ్ రూమ్ తాళం ఓపెన్ అయినప్పటికీ అందులో కోర్టుకు అవసరమైన సంబంధిత  పత్రాలు లేవు. వారి వద్ద ఉన్న తాళం చేవిలతో  మిగతా రెండు స్ట్రాంగ్ రూములు తెరిచేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. తెరుచుకోకపోవడంతో మరో మారు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కొసం వెతికిన లభించలేదని అధికారులు ప్రకటించడంతో రెండు తాళం చేవిలు మిస్స్ అయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. తాళాలు పగలగొట్టి తెరిచే ప్రయత్నాన్ని అడ్లూరి లక్ష్మన్ కుమార్ అడ్డుకున్నారు. దీంతో  తెరిచిన స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ మళ్లీ సీజ్ చేసి మరుసటి రోజు స్ట్రాంగ్ రూము తాళం చెవిలు మిస్స్  అయ్యాయని హైకోర్టుకు నివేదించారు. విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన హైకోర్ట్ తాళాలు మిస్సింగ్ ఫై పూర్తీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.


కోర్టు ఫై నమ్మకం ఉన్నది ....
కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి  లక్ష్మన్ కుమార్ 
నాలుగున్నర ఏళ్లుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వద్ద ఉండాల్సిన ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు ఎవరి వద్ద ఉన్నాయి. ప్రత్యర్థి అయిన మంత్రి కొప్పుల ఈశ్వర్ తనకు మధ్య కోర్టులో కేసు నడుస్తుండగా ప్రత్యేక చర్యలు తీసుకొని భద్రంగా ఉంచాల్సిన తాళం చెవులు ఇంత నిర్లక్ష్యంగా ఎక్కడ మిస్ చేశారు. కోర్టు వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయం గెలుస్తుందని నేను భావిస్తున్నా. 13 రౌండ్ల వరకు 3200 మెజార్టీతో ఉన్న తాను 14వ రౌండ్లో 440 ఓట్లతో ఎలా ఓడిపోతాను. పూర్తిగా ఇవి ప్యాట్స్  లెక్కించి తనకు న్యాయం చేయాలి.