రోడ్డుపై మద్యం వాహనం ఇలా.. వాహనాలు వెళ్ళేదెలా.. పట్టించుకోని పోలీసులు.

రోడ్డుపై మద్యం వాహనం ఇలా.. వాహనాలు వెళ్ళేదెలా.. పట్టించుకోని పోలీసులు.

మెట్‌పల్లి ముద్ర:- మందు (మద్యం) లోడు వాహనాలు రోడ్డుపై నిలిపిన మమ్మల్ని అడిగేవారు ఉండరు. మేము ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తున్నాం.అని అనుకున్నాడేమో ఆ వాహనదారుడు ఏకంగా రోడ్డుపైనే వాహనాన్ని నిలిపి మద్యం వాహనంలో నుండి మద్యం లోడ్ ఖాళీ చేస్తున్నాడు. అయినా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని నిత్యం రద్దీగా ఉండే వ్యవసాయ మార్కెట్ రోడ్ వద్ద ఉన్న ఓ వైన్స్ షాప్ కు మద్యం సరఫరా చేసేందుకు మద్యం లోడ్ తో ఓ వ్యాన్  వచ్చింది. మద్యం లోడ్ ఖాళీ చేసే సమయంలో ఆ డ్రైవర్ ఆ వాహనాన్ని పూర్తిగా రోడ్డుపై నిలిపి మద్యాన్ని వైన్స్ లోకి సరపర చేస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో వెళుతున్న వాహనదారులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది.అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీస్ వాహనంలో ఉన్న సిబ్బంది ఆ మద్యం లోడ్ వాహనం రోడ్డుపై ఉన్న చూసి చూడనట్లు వెళ్ళడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. నిత్యం ఏదో ఒక సాకుతో సామాన్య ప్రజలకు జరిమాణాలు విధించే పోలీసులు రోడ్డుపై వాహనం నిలిపి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.