యుద్ధ ప్రాతిపదికన కొనుగోల్లు పూర్తి చేయాలి

యుద్ధ ప్రాతిపదికన కొనుగోల్లు పూర్తి చేయాలి

సారంగాపూర్ ముద్ర: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని జగిత్యాల జిల్లా బిజెపి నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నాగునూరు లచ్చక్క పేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 60 రోజులు గడుస్తున్న నేటికీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి కాకపోవడం శోచనీయమన్నారు.

ఐకెపి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాo అక్కడ వర్షానికి తడిసి చెదలు వస్తుందని వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని లేనిపక్షంలో ఎక్కడికి అక్కడ నిల్వ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయన వెంట బిజెపి సారంగాపూర్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్, బీజేవైఎం మండల అధ్యక్షుడు దీటి వెంకటేష్, కిషన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి దామెర జలంధర్ రెడ్డి, ఏలేటీ రంజిత్ రెడ్డి, బొడ్డుపల్లి రాజు, విలాసాగరపు రవి, గోవర్ధన సునీల్, అత్తి నేని రామ్ గోపాల్,సత్తన్న,రైతులు పాల్గొన్నారు.