మల్యాలలో జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

మల్యాలలో జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

ముద్ర, మల్యాల:మండలంలోని మల్యాల క్రాస్ రోడ్డు వద్ద గురువారం బాబు జగ్జీవన్ రామ్ 37వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోచమల్ల ప్రవీణ్, మారంపల్లి గంగాధర్,  ఆగంతపు వంశీ, జనగాం శేఖర్, సంజీవ్, బాబు, నారాయణ, రవీందర్, రవి, తదితరులు పాల్గొన్నారు.