ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి 

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి 

రైస్ మిల్లర్లు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.  జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  అధ్యక్షతన జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు ప్రధాన అంశమని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైసు మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే కటిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ళు పూర్తి అయ్యేవరకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత మాట్లాడుతూ తెలంగాణా అంబేడ్కర్ సీఎం కెసిఆర్ అని, ప్రధాని నరేంద్ర మోడీకి  అంబేద్కర్ మీద గౌరవము చిత్త శుద్ది ఉంటే నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్  పేరు పెట్టాలని అన్నారు.  భారత దేశంలోని మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత సాధించుటకు దేశవ్యాప్తంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్ లో మహిళా బిల్ ను  ప్రవేశపెట్టాలని మార్చి10న  దేశ రాజధాని డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత  ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా పియం నరేంద్ర మోడీ   పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ మిషన్ భగిరత నీరు రావడం లేదని అధికారులఫై ఆగ్రహం వక్య్తం చేశారు. జిల్లా ప్రభుత్వ వైద్య ఆసుపత్రి సుపరిండేంట్ రాములు ప్రతి సారి జడ్పీ మీటింగ్ కు రావడం లేదని చైర్ పర్సన్ మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లగా సుపరిండేంట్ రాములుకు  ఫోను చేసిన మంత్రి సమావేశం ముగిసే లోపు రావాలని ఆదేశించారు... అయిన హాజరు కాలేదు. ఈ సమవేశంలో,అడిషనల్ కలెక్టర్ మంద మకరంద్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా రైతుబంధు అద్యక్షుడు  చీటీ వెంకట్ రావు, జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.