రెండు ఆపరేషన్లు ప్రభుత్వాసుపత్రిలోనే జరిగాయి.... ఇదిగో సాక్షాలు

రెండు ఆపరేషన్లు ప్రభుత్వాసుపత్రిలోనే జరిగాయి.... ఇదిగో సాక్షాలు
  • జిల్లా ఆసుపత్రి సుపరిండేంట్ వివరణఫై  భాదితురాలి కుట్టుంబ సభ్యుల ఆగ్రహం
  • ఆపరేషన్ చేసి కడుపులో గుడ్డ మరిచిపోయిన ఘటనఫై కలెక్టరేట్ కు బాధితులు
  • సుమోటోగా స్వీకరించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి  డెలివరీ కోసం వచ్చిన నవ్య శ్రీకి  ఆపరేషన్ చేసి కడుపులో గుడ్డ మరిచిపోయిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించగా జిల్లా వైద్యాధికారి డా. శ్రీధర్, జిల్లా ఆసుపత్రికి సుపరిండేంట్ డా. రాములు, గైనకాలజీ హెచ్. ఓ.డి అరుణలు జరిపిన విచారణ అనంతరం చేసిన ప్రకటనఫై బాధితురాలి కుటుంబ సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు.   జిల్లా ఆసుపత్రి సుపరిండేంట్ రాములు ప్రెస్ కు రిలీజ్ చేసిన ప్రకటనపై బాధితురాలు కుటుంబ సభ్యులు జగిత్యాల జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసేందుకు వచ్చారు.  వైద్యులు తమను(బాధితురాలు నవ్యశ్రీని) ప్రత్యక్షంగా కలవనిలేదని ఫోన్ లో మాత్రమే సంప్రదించి వివరాలు తెలుసుకున్నారని, బాధితురాలు నవ్యశ్రీ తో ఫోన్లో పొడి పొడి సమాచారం తెలుసుకొని ప్రత్యక్షంగా విచారించినట్లు ప్రకటించారు.

అంతే కాకా నవ్యశ్రీ  ఎక్కడ డెలివరీ అయిందో కూడా పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా ఇదివరకు మొదటి, రెండవ కాన్పు కొరకు వేరే ఆస్పత్రిలో ఆపరేషన్లు జరిగాయని అది ఎప్పుడు కడుపులోకి వెళ్లిందో తెలవదని ఒక ఆపరేషన్ మాత్రమే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగిందని అబద్ధం చెప్పరన్నారు.  అంతకుముందు జరిగిన ఆపరేషన్లలో కూడా గుడ్డ కడుపులోకి వెళ్లి ఉండవచ్చు అని అనుమానాన్ని వ్యక్తం చేయటం బాధాకరం అన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు బృందం తీరుపై మరోమారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు నవ్య శ్రీ అత్త మరిది కుటుంబ సభ్యులు కలిసి పిర్యాదు చేశారు.

వైద్యులు చెప్పింది అబద్ధం
రెండు ఆపరేషన్లు ప్రభుత్వాసుపత్రిలోనే జరిగాయి...
ఇదిగో సాక్షాలు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ్య శ్రీ 2016లో జగిత్యాల పట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మొదటి డెలివరీ అయింది. రెండోసారి 2020, నవంబర్1న జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. అలాగే మూడవ ప్రసవం కూడా 2021, డిసెంబర్29న జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి ప్రసవంచేశారు. అందుకు సంబంధించిన ఆసుపత్రి రికార్డులను వారు ప్రదర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో లోనే గత రెండు ఆపరేషన్లు జరగగా వైద్యుల తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకే ఇదివరకు జరిగిన ఆపరేషన్లలోమాపు (గుడ్డ) మరిచిపోయి ఉండవచ్చు కదా ఆపరేషన్లు మా ఆస్పత్రిలో జరగలేదు కదా అని నిర్లక్ష్య సమాధానం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్న స్థాయి అధికారులతో విచారణ జరిపి తమకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో నవ్య శ్రీ అనారోగ్యం పాలవడంతో పాటు ఆపరేషన్ కోసం లక్షల రూపాయలు వెచ్చించామని... కూలి నాలి చేసుకుని బ్రతికే తమను ప్రభుత్వమే ఆదుకొవాలని, బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోని మరొకరికి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

బాన్సువాడలో విచారణ ....
బాధితురాలి వివరాలను ఫోన్లో అడిగి తెలుసుకోవడం, బాధితురాలు స్కాన్ చేసుకున్న ఆసుపత్రిని సందర్శించకనే విచారణ అధికారుల బృందం విచారణ నివేదిక ఇవ్వడంఫై  జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కుర్చుని నివేదిక తాయారు చేసారా... బాధితురాలి వద్దకు ఎందుకు వెళ్ళలేదు అని చివాట్లు పెట్టినట్లు తెలిసింది. ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నవ్యశ్రీ కడుపులో మాపు వదిలిపెట్టి కుట్లు ఎవరు వేశారు తెలుపాలని ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  విచారణ అధికారులు జిల్లా వైద్యాధికారి డా. శ్రీధర్, జిల్లా ఆసుపత్రికి సూపండెంట్ డా. రాములు, గైనకాలజీ హెచ్ ఓడిల అరుణ నిజామబాద్ జిల్లా బాన్సువాడలో తల్లిగారింట్లో ఉన్న బాధితురాలు నవ్యశ్రీ విచారించి, ఆనంతరం నవ్యశ్రీ స్కానింగ్ చేసుకున్న సెంటర్ లో విచారణ జరిపారు.

సుమోటోగా స్వీకరించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ 
మహిళ కడుపులో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డెలివరి ఆపరేషన్ చేసి మాపు(కాటన్ గుడ్డ) మరిచిపోయిన సంఘటన కథనాలను మీడియాలో ప్రచురణ, టెలికాస్ట్ కావడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు పూర్తి స్థాయి నివేదిక సమర్పిచాలని, విచారణ బృందాన్ని, అప్పటి సుపరిండేంట్ ను అదేసిన్చినట్లు సమాచారం.