గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

చిన్న, పెద్దా వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోట్లు మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. మంగళవారం  ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి  ఒకరు గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఎస్కే ఫిరోజ్ (17).. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాత్రి అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి.. హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందంటూ కేకలు వేశాడు. దీంతో వెంటనే పక్కనున్నవారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు.