దళితబందు డబుల్ బెడ్రూం మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి పెడుతోంది..

దళితబందు డబుల్ బెడ్రూం మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలి  కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి పెడుతోంది..

దళితబందు డబుల్ బెడ్రూం మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలి 
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి పెడుతోంది: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి,జగిత్యాల: గతేడాది కేటాయించిన నిధుల్లో ఒక్కరికై నా దళితబందు, ఒక్క డబుల్ బెడ్రూం ఐనా నిర్మించారా అని వీటిఫై మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్వేత పత్రం విడుదల చేయాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్ర భవన్ లో ఏర్పాటు విలేకరుల సమావేశంలో  ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి లోకి లాగారాని బడ్జెట్ నిధుల కోసం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి  నిదర్శనం అని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతోందని..రాష్ట్రంలో ప్రభుత్వ భుములు అమ్మకానికి పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ద్వజమెత్తారు. ప్రచార ఆర్భాటాలు మాని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో పిసిసి సభ్యుడు గిరి నాగభూషణం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు,చందా రాధా కిషన్, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, నక్క జీవన్, కాంగ్రెస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు నేహాల్, మహిపాల్ పాల్గొన్నారు.