కొండగట్టు అభివృద్ధికి బిజెపి వ్యతిరేకమా...

కొండగట్టు అభివృద్ధికి బిజెపి వ్యతిరేకమా...
Is BJP against the development of Kondagatu minister koppula
  • బండి, అరవిందులు రాజకీయ వ్యవస్థ కలంకం...
  • బిజెపికి సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు... మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కొండగట్టు ఆలయ అభివృద్ధికి బిజెపి వ్యతిరేకమా... మేము అభివృద్ధి పనులు నిలిపివేస్తాం మీరు అభివృద్ధి చేస్తారా ... అంటూ ఎంపీ బండి సంజయ్ కి మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొండగట్టు అభివృద్ధి చేస్తున్నారు అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బండి సంజయ్ వాక్యాలతో రాజకీయ కలుషిత వాతావరణం, విష సంస్కృతిలు  ఏర్పడతాయన్నారు. మరో తిరుపతిలో తీర్చిదిద్దిన యాదాద్రి లాగా కొండగట్టును అభివృద్ధి చేసేందుకు 600 కోట్ల నుంచి 1000 కోట్లు ఖర్చు అయిన వెనకాడది లేదని సీఎం పేర్కొంటే, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరిచేందుకు సీఎం కేసీఆర్ వస్తే ఆలయం పేరుతో భూదందా అని నీచమైన ఆరోపణలు చేయడం హనుమాన్ భక్తులను ఈ ప్రాంత ప్రజలను అవమానించినట్లేనన్నారు. దేవాలయాలకు ప్రత్యక్షంగా నిధులు ఇచ్చే గొప్ప సంస్కృతిని తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని, దేవుని పేరు చెప్పే బిజెపి ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మీరు మాటిమాటికి పేరు చెప్పే భాగ్యలక్ష్మి టెంపుల్ కు ఒక రూపాయి అయినా ఖర్చు పెట్టారన్నారు.

రాజకీయ వ్యవస్థకు బండి సంజయ్, అరవిందులు ఒక కలంకమన్నారు, వారి వాక్యాలు సిగ్గుచేటని ఇలాంటి నాయకులను ప్రజలు తరుముతారన్నారు. సంజయ్ లాంటి పిచ్చివాడికి, ఉన్మాదికి ప్రజల సమాధానం చెప్తారని అన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి సహకార సంఘాలను దెబ్బతీస్తుందని, 7 ఏళ్ల కాలంలో మీరు తీసుకున్న ఏ ఒక్క మంచి నిర్ణయం ఉంటే చెప్పండి అని ప్రశ్నించారు. సంజయ్ వ్యాఖ్యలు అభివృద్ధికి గొడ్డలి పెట్టు అని బిజెపికి ప్రజలు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని ఇకనైనా బండి సంజయ్ లాంటి నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,  జడ్పీ చైర్పర్సన్ దావసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.గొల్లపల్లి చంద్ర శేఖర్ గౌడ్,  డిసిసిబి చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్,బాధినేని రాజేందర్, గట్టు సతీష్ లు పాల్గొన్నారు.