లీకులను నిరసిస్తూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం

లీకులను నిరసిస్తూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం

 యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ చేసిన పోలసులు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: టి యస్ పి ఎస్సీ, 10 వ తరగతి పేపర్ లీకులను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ అఫీస్ ముట్టడికి యత్నించారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో  ఇన్నీ  లీకులు జరగుతున్న  విద్యార్థి, నిరుద్యోగ యువత జీవితాల గురించి  బీఆర్ఎస్ నాయకులకు లకు చీమకుట్టినట్లు లేదన్నారు.  

అరెస్టులతో యూత్ కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు.
ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నాయకులు  నేహల్,నక్క జీవన్, అనుగందుల కిరణ్, కట్ట శివ, అసెంబ్లీ అధ్యక్షుడు బాపు రెడ్డి, రియాజ్, రాగుల ప్రదీప్, అనిల్, అర్బబ్, జితేందర్, అసాది హరీష్, పట్టణ అధ్యక్షుడు బిరం రాజేష్, శివ, తిరుపతి,నరేష్, బోగ సందీప్,అతవులా, రోహిత్, శేకర్,సతీష్,అనిల్,మహేందర్ రెడ్డి, ప్రమోద్, రాజశేఖర్ రెడ్డి,సుమిత్, దిలీప్,రమణ రెడ్డి,తిరుపతి రెడ్డి, మధు ఎన్ ఎం ఎస్, అరవింద్, రాజేష్,మధు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.