ఇంటర్ ఫెయిల్ అయ్యానని విద్యార్ధి ఆత్మ హత్య...

ఇంటర్ ఫెయిల్ అయ్యానని విద్యార్ధి ఆత్మ హత్య...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మేడిపెల్లి మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థి పరీక్ష  ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి అభిషేక్ (17) జగిత్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ చదివాడు. మంగళవారం విడుదల అయిన ఫలితాలలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అభిషేక్  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మేడిపల్లి పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.