పేదలకు వైద్యం అందకుండా చేసిన దుర్మార్గుడు కేసిఆర్ 

పేదలకు వైద్యం అందకుండా చేసిన దుర్మార్గుడు కేసిఆర్ 
  • సీఎం కేసీఆర్ కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు
  • బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయకుండా పేదలకు హెల్త్ కార్డులు అందకుండా చేసిన దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో బుధవారం జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బీజేపీ సంయుక్త సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యథితగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. దేశంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకువచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం బిజెపి.

 రైతుల 20 శాతం ప్రీమియం కడితే మిగిలిన 80% ప్రీమియం కట్టి రైతుల పక్షాన నిలిచింది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు.15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి. 9 ఏళ్ల కాలంలో గ్రామపంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం నుండి వచ్చినవే.పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, వైకుంఠధామాలు, స్వచ్ఛభారత్, ఉపాధి హామీ వంటి పథకాలు కేంద్రం ఇచ్చిన ఫండ్స్ తో చేపట్టినవే ఆని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ.శ్రావణి నిజాంబాద్ పార్లమెంటరీ ప్రబారి వెంకటరమణి, పార్లమెంట్ కన్వీనర్ భూమన్న, జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ మదన్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ, బిజెపి నాయకులు డాక్టర్ శైలేందర్ రెడ్డి, పన్నాల తిరుపతి రెడ్డి, వివిధ మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.