జగిత్యాల పట్టణ సిఐగా రాంచందర్ రావు

జగిత్యాల పట్టణ సిఐగా రాంచందర్ రావు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ సిఐగా కే. రామచందర్ రావును బదిలీ చేస్తూ మల్టీ జోనల్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మికుంట పట్టణ సిఐగా పనిచేస్తున్న రామచందర్ రావు ను జగిత్యాలకు బదిలి చేయగా ప్రస్తుతం పట్టణ సీఐగా పనిచేస్తున్న కిషోర్ ను మల్టీజ్జోన్ 1కు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రంచదర్ రావు  జిల్లాలోని ధర్మపురి సిఐగా పనిచేశారు.