ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయిన గీతా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయిన గీతా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి..   ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయిన గీతా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో ఈ నెల 16న ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతి అయిన ఈత వనంలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి బావి, పైపు లైన్ల ఏర్పాటు కోసం రు.5 లక్షల సీడిపీ నిధులు మంజూరు చేసి, కొబ్బరి కాయ కొట్టి,భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా గీతా కార్మికులు జీవన్ రెడ్డి కి అభిమానంతో కల్లు పోసి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఎమ్మెల్సీ  మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో చెట్లు కాలిపోయి, ఉపాధి కోల్పోయిన గీతా కార్మికులకు పరిహారం అందించి, గీతా కార్మిక వృత్తికి భరోసా కల్పించాలని దేమండ్ చేశారు.

ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన కాలంలో నుండి గీతా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ, వారి వెంటే ఉంటున్నానని అన్నారు. క ల్లు గీసే వారికే హక్కులు కల్పించామని అన్నారు. గీతాకార్మికుల సహకార సంఘాలను ఏర్పాటు చేసి, గీతా కార్మికుల ఉపాధికి భరోసా కల్పించామన్నారు. గీతా కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు..మీకు అండగా నేను ఉంటా అంటూ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ముక్కెర మారుతి, నేరెళ్ల ఏళ్ళ గౌడ్, గాజర్ల, శంకర్,గాజర్ల అంజన్న, గాజర్ల బుచన్న, పెండం అనిల్, మల్లేశం,కాసరపు మల్లయ్య, మనోజ్,నందన్న,సల్లురి శివ, తిరుపతి, జలెందెర్ గౌడ్,  నీరటి గంగన్న ఒగులపు వెంకట్ రెడ్డి,తిరుపతి, మల్యాల మోహన్,పడాల నరేష్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.