జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలి. ఆగ సురేష్ మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు

జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలి. ఆగ సురేష్ మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు

మెట్‌పల్లి ముద్ర:- జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో చదివే జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షుడు ఆగ సురేష్, ప్రధాన కార్యదర్శులు భూరం సంజీవ్, మ్యాకల శివ లు కోరారు. మంగళవారం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ నిత్యం జరిగే వివిధ సంఘటనలను పత్రికలు, టీవీ ఛానల్ ల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారని. కొందరు జర్నలిస్టులకు సంస్థలు జీతాలు ఇవ్వగా, కొందరికి వచ్చే జీతాలు సరిపోక చాలీచాలని జీవితాలను గడుపుతున్నారని. జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.జర్నలిస్ట్ ల పిల్లల కోసం ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ లను ఏర్పాటు చేయాలన్నారు.  కొన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ లు జర్నలిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితో కల్పించాలని జిల్లా విద్యాధికారికి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేస్తున్నారని. దీనిని పరిగణలకు తీసుకొని జగిత్యాల జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని 50% ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా (టీయూడబ్ల్యూజే ఐజేయు) ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సహకారంతో ఫీజు రాయితీపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు దాసం కిషన్, ఉపాధ్యక్షుడు మహ్మద్ అజీమ్, జంగం విజయ్, తరి రాజశేఖర్, అలలా రాజేష్, ఓంకారి శ్రీనివాస్, మదస్తు రాజేష్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, మసూద్, హేమాద్, పింజరీ శివ కుమార్, బొల్లాం రాజు, కలిమ్, సజెబ్, మహ్మద్ సభియొద్దిన్,మహేందర్, తదితరులు పాల్గొన్నారు.