బాసర త్రిబుల్ ఐటీకి ఇందిరానగర్ హైస్కూల్ నుంచి 32 మంది  విద్యార్థులు ఎంపిక 

బాసర త్రిబుల్ ఐటీకి ఇందిరానగర్ హైస్కూల్ నుంచి 32 మంది  విద్యార్థులు ఎంపిక 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: బాసర త్రిబుల్ ఐటీలో సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
సోమవారం వెలుపడిన బాసర త్రిబుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్ లో జెడ్పి హెచ్ఎస్ ఇందిరా నగర్ పాఠశాల విద్యార్థులు 32 మంది సెలెక్ట్ అయ్యారు.ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి హరీష్ రావు తో పాటు పలువురు అభినందించారు. 

 త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు వీరే 

బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థుల లిస్టును హెడ్మాస్టర్ సత్యనారాయణ రెడ్డి, పదవ తరగతి విద్యార్థుల ఇంచార్జ్ అరుణ రెడ్డి విడుదల చేశారు. ఎం.ఆరిక, జి.వాత్సల్య, కే.నిషిత, ఎస్.వర్ష, ఎం.రవిచరణ్, ఈ.సహస్ర, జి.అమృత వర్షిని, జి. అర్చన, కే.సుదీక్ష, స్పందన, జె.మణిదీప్, అనిష్ కుమార్, దీప్తి, యు.నవీన్, కృష్ణవర్ధన్, జే విష్ణు తేజరెడ్డి, కె సౌమ్య, శ్రీహరిణి ఆస్మా, అజ్మత్బి , అలేఖ్య, కే.సాత్విక రెడ్డి, జి.తేజస్విని, బి.రచన, ఎం.వేదశ్రీ, ఏ. భువనకృతి, సి. భార్గవి, కే.గీతిక, ఎం. అశ్విని, సన, కె. రోజా ఎం.రేష్మ ఎంపికయ్యారు.

మంత్రి హరీష్ రావు స్పెషల్ ఫోకస్

రాష్ట్రంలోనే మోడల్ ఇంగ్లీష్ మీడియం జడ్పీ హైస్కూల్ గా పేరుగాంచిన ఇందిరా నగర్ పాఠశాల విద్యార్థులపై మంత్రి హరీష్ రావు స్పెషల్ ఫోకస్ పెట్టి అన్ని రకాల వసతులు కల్పించారు. విద్యార్థులకు క్యూఆర్ కోడ్ బుక్స్ సప్లై చేశారు.దానికి తోడు పదిమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయురాలుని ప్రత్యేకంగా నియమింపజేసి చదివేలా చర్యలు తీసుకున్నారు. దీంతో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించి అటు మంత్రి పేరును, ఇటు పాఠశాల పేరును నిలబెట్టారు. కష్టపడి చదివి త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించి తమ భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఈ పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి సహకరించారని హెడ్మాస్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది

 పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను చక్కగా చదువుకునేలా ప్రోత్సహించారు. ముఖ్యంగా ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 వరకు విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక తరగతులు ఇట్టి విజయానికి చాలా తోడ్పాటును అందించాయి. విద్యార్థుల ప్రత్యేక తరగతులకు దాతలు కూడా తమ వంతు సహాయం అందించి స్నాక్స్ అరేంజ్ చేశారు