సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 8 నుండి 15వ ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ అమలులో ఉన్న సమయంలో కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు,సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆమె తెలిపారు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణ అత్యవసరమైతే ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు కూడా ఈ నెల 8 నుండి 15 ఉదయం 6 గంటల అమల్లో ఉంటాయని తెలిపారు.

  సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 db (A), 45db (A), 65db (A), 30 పోలీస్ యాక్ట్ 1961, రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.చిన్నపిల్లలు, వృద్ధులు,రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగిందని తెలిపారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. ఆమె పేర్కొన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 IPC, సెక్షన్ 70(A), 70(B) 70 C, 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1961 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి హెచ్చరించారు.