బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది

బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముద్ర, ముషీరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పాఠశాలల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఆయన సూచించారు. కవాడిగూడ చిత్రాల నర్సింహులు స్మారక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ లోని బీమా మైదాన్ లో, భోలకపూర్ డివిజన్లోని బొంతల్ బస్తీలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ఉన్నతమైన ఫలితాలను సాధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ చిరంజీవి, డిప్యూటీ ఐఓఎస్ శ్రీనివాసరాజు, కవాడిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ మేడె దేవదాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శోభారాణి, సౌందర్య లత, వసంత, స్వప్న, వంశీ, నాగయ్య, సోమన్న, హేమ శ్రీలత తోపాటు బిఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, భోలకపూర్ డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్ రావు, నాయకులు జైసింహ, సాయి కృష్ణ, నాయకులు రామచందర్, మహమ్మద్ అలీ, రాజేష్, రహీం, శంకర్ గౌడ్, వల్లాల రవి యాదవ్, మాధవి, రమణ, మక్బుల్, ఉమాకాంత్, కృష్ణ, శ్రీధర్ రెడ్డి, గోవింద్, ప్రవీణ్, రామ్ , ఎల్లేష్ పాల్గొన్నారు.