పౌరుల సహకారం తప్పనిసరి మంత్రి కేటీఆర్​

పౌరుల సహకారం తప్పనిసరి మంత్రి కేటీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచాలన్నా, హైదరాబాద్​ ను విశ్వనగరంగా మార్చాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని మంత్రి కేటీఆర్ ​కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని అడ్మినిస్ట్రేటివ్​స్టాఫ్​ కాలేజ్​ ఆఫ్​ ఇండియా లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. 9 ఏండ్లలో రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని, నగర జీవన ప్రమాణాలు పెరిగాయని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమం అయినా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్ నివేదిక‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్షణ‌కు సంబంధించి విడుద‌ల చేసిన తాజా బుక్‌లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని, మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే చాలా ముందు వ‌రుస‌లో ఉన్నామన్నారు. ఇది రాష్ట్రానికి గౌర‌వ కార‌ణమని, సాగునీరు, తాగునీరు, అట‌వీ సంప‌ద‌, పంచాయ‌తీ రాజ్, ప‌ట్టణాభివృద్ధి, ప‌రిశ్రమ‌ల్లో  తెలంగాణ ప్రత్యేకతను దక్కించుకోవడంలో సీఎం కేసీఆర్​ పని నిదర్శనమన్నారు. అన్ని రంగాల్లో హైద‌రాబాద్, తెలంగాణ అగ్రభాగానా ఉంటున్నాయని కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా ఆస్క్​ ఆవరణలో చెట్లతో ఎండకాలం అయినా చల్లగా ఉందని, ఏసీ ఆడిటోరియం కంటే బాగుందని కితాబిచ్చారు