పాపం కోతులు..! - కొండగట్టులో త్రాగునిటీకై వానరాల ఇక్కట్లు..

పాపం కోతులు..! - కొండగట్టులో త్రాగునిటీకై వానరాల ఇక్కట్లు..

ముద్ర, మల్యాల: కొండగట్టు ప్రాంతంలో కోతులు త్రాగునిటీకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.. కొండగట్టు మొత్తం కూడా అటవీ ప్రాంతం కావడం వల్ల కొండపైన, కింద వేలాదిగా కోతులు జీవిస్తున్నాయి. ఇక దేవస్థానంలో వందలాదిగా వానరాలు భక్తులు వేసే ప్రసాదం, కొబ్బరిముక్కలు తింటూ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో ఎవరుకూడా ఇంట్లోoచి వెళ్లే పరిస్థితి లేదు. అలాంటిది మూగజీవల పరిస్థితి దారుణంగా ఉంటుoది. భక్తులు వేసే ఆహారం తిని జీవిస్తున్న వాటికి త్రాగునీరు లభించక ఇబ్బందులు పడుతున్నాయి. ఆలయ అధికారులు స్పందించి ఆలయ ప్రాంతం, ఘాట్ రోడ్డు వెంబడి అక్కడక్కడా కుండీలు, లేదా డ్రంబులు ఏర్పాటు చేసి త్రాగునీరు సౌకర్యం కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. అంజన్నకు ప్రతీకైనా కోతులు కొండపై ఉంటేనే భక్తి పారవశ్యo పెంపోoదుతుందని భక్తుల నమ్మకం..